- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోట శ్రీనివాసరావు పార్థివదేహం...కన్నీళ్లు ఆగవు !
టాలీవుడ్ ఇండస్ట్రీ మరో ప్రముఖ నటుడిని కోల్పోయింది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఇవాళ ఉదయం

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీ మరో ప్రముఖ నటుడిని కోల్పోయింది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఇవాళ ఉదయం మృతి చెందారు. ఈ వార్తతో టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దాదాపు 750 సినిమాలు చేసిన కోట శ్రీనివాసరావు... ఒకప్పుడు విలన్ గా... ఆ తర్వాత తండ్రి, తాతయ్య పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.
1978 నుంచి చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నాడు కోట శ్రీనివాసరావు. అయితే అలాంటి కోట శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా డయాలసిస్ తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాలి వేలు కూడా తొలగించారట. దీంతో అప్పటి నుంచి.. కోట శ్రీనివాసరావు ఆరోగ్యం మరింత క్షీణించినట్లు చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో హైదరాబాదులోని ఫిలిం నగర్ లో... కోట శ్రీనివాసరావు మరణించారు.
ఇక ఆయన మరణం నేపథ్యంలో.. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, మంత్రులు, రాజకీయ పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే... కోట శ్రీనివాసరావు పార్థివ దేహానికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన ఆయన అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.






