- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తుపట్టలేని స్థితిలో కోట శ్రీనివాసరావు... ఫోటో వైరల్
టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు విలన్ గా.. ఆ తర్వాత తండ్రి పాత్రలో,

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు విలన్ గా.. ఆ తర్వాత తండ్రి పాత్రలో, ఇప్పుడు తాత పాత్రల్లో నటిస్తున్నటాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు విలన్ గా.. ఆ తర్వాత తండ్రి పాత్రలో, ఇప్పుడు తాత పాత్రల్లో నటిస్తున్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు ( Kota Srinivasa Rao) ఒకరు. అప్పట్లో విలన్ అంటేనే కోటా శ్రీనివాసరావు అన్న రేంజ్ లో... ఉండేది. అలాంటి కోటా శ్రీనివాసరావు ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు.
ఆయన ఆరోగ్యం... చాలా క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బండ్ల గణేష్ ( Bandla Ganesh) తాజాగా... నటుడు కోటా శ్రీనివాసరావును కలిశారు. ఈ సందర్భంగా కోటా శ్రీనివాసరావు తో కలిసి ఫోటో కూడా దిగారు. కోటా శ్రీనివాస రావును ఇవాళ కలిసాను... కోట బాబాయ్ ని కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటూ... ఆయనను కలిసిన ఫోటోలు షేర్ చేసుకున్నాడు బండ్ల గణేష్.
అయితే బండ్ల గణేష్ షేర్ చేసిన ఫోటోలో కోట శ్రీనివాసరావు ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని తెలుస్తోంది. ఆయన విపరీతమైన షుగర్ వ్యాధితో ( Sugar) బాధపడుతున్నట్లు ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది. అలాగే ఆయన ఎడమ కాలికి తీవ్ర గాయం కూడా ఉంది. షుగర్ ఉన్న వాళ్లకు అలాంటి గాయాలు సాధారణమని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ ఫోటోను చూసిన కోట శ్రీనివాసరావు ఫ్యాన్స్... ఎమోషనల్ అవుతున్నారు.






