- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందుబాబులకు ఊపు తెప్పించిన కోట... ఎక్కడికి వెళ్లినా అదే పాట!
టాలీవుడ్ స్టార్ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao)... తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao)... తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో కన్నుమూశారు కోట శ్రీనివాసరావు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో.. విషాద ఛాయలు అలుముకున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో.. 750 కి పైగా సినిమాలు చేసిన కోట శ్రీనివాస మృతి నేపథ్యంలో... ప్రముఖులందరూ సంతాపం తెలుపుతున్నారు.
అయితే ఇలాంటి నేపథ్యంలో.. కోట శ్రీనివాసరావును మందుబాబులు.. గుర్తు చేసుకుంటున్నారు. మందుబాబుల కోసం కోట శ్రీనివాసరావు పాడిన పాటను.. నెమరు వేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో (Gabbar Singh)... మందు బాబులం మేము మందు బాబులం (Mandu Babulam Song)... అంటూ కోట శ్రీనివాసరావు పాడిన పాటను.. అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
అప్పట్లో ఈ సినిమా పాట ఇండస్ట్రీని షేక్ చేసింది. అంతేకాదు ఈ పాటలో హీరో పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీతో కలిసి కోట శ్రీనివాసరావు స్టెప్పులు కూడా వేస్తారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఫంక్షన్, మందు పార్టీలలో... కోట శ్రీనివాసరావు పాడిన ఈ పాటను.. పెట్టుకొని మరీ ఎంజాయ్ చేస్తారు యూత్. పెళ్లి భరాత్ లో కూడా ఈ పాటను పెట్టి స్టెప్పులు వేస్తారు.






