- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగాస్టార్ చిరంజీవితోనే కోట కెరీర్ టర్న్.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర
టాలీవుడ్ దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఇవాళ మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోట

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఇవాళ మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో మరణించారు. అయితే ఇలాంటి నేపథ్యంలో కోట శ్రీనివాసరావు... నటించిన సినిమాల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి అలాగే కోట శ్రీనివాసరావు నటించిన సినిమా... వైరల్ గా మారింది.
రంగస్థల నటుడు అయిన కోట శ్రీనివాసరావు 1978లో ప్రాణం ఖరీదు (Pranam Khareedu) అనే నాటకంలో నటించి మెప్పించారు. అయితే ఈ నాటకాన్ని చూసిన నిర్మాత క్రాంతి కుమార్ అదే పేరుతో సినిమా కూడా తీశారు. ఇక ఆ మూవీతోనే మెగాస్టార్ చిరంజీవి కూడా హీరోగా ఎంట్రీగా పరిచయమయ్యారు. ఇదే సినిమాతో కోటా శ్రీనివాసరావు కూడా చిన్న పాత్రతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ అహ నా పెళ్ళంట సినిమాతో బాగా పాపులర్ అయ్యారు కోట శ్రీనివాసరావు. అప్పటినుంచి కోట శ్రీనివాసరావు వెనక్కి తిరిగి చూసుకోలేదు.
అంతేకాదు రాజకీయాల్లో కూడా కోట శ్రీనివాసరావు కొనసాగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కోట శ్రీనివాసరావు. ఆ తర్వాత ఎక్కువ రోజులు రాజకీయాల్లో కొనసాగలేదు. ఇటు 2017 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును కూడా దక్కించుకున్నారు. మొత్తం తొమ్మిది నంది అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు కోట శ్రీనివాసరావు.






