- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య సినిమా కోసం హిట్ ఫార్ములాను ఫాలో కానున్న కొరటాల
బాలకృష్ణ–కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాలో బాలకృష్ణ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా కోసం కొరటాల శివ తన హిట్ ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు సమాచారం. గతంలో ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానానికి కొరటాలకు మంచి ప్రశంసలు లభించాయి.
అలాగే బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు కొరటాల తదుపరి చిత్రంలో బాలకృష్ణ కూడా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. బాలకృష్ణ రీసెంట్ టైంలో ముఖ్యమంత్రి పాత్రలో నటించకపోవడంతో, ఈ పాత్రలో ఆయన కనిపిస్తే అంచనాలు తారాస్థాయికి చేరుతాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఒక సినిమాలో హీరోను ముఖ్యమంత్రిగా చూపించి విజయం సాధించిన అనుభవం ఉండడంతో, ఈ సబ్జెక్ట్‌ను కొరటాల శివ సులభంగా హ్యాండిల్ చేయగలరని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.






