- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డైరెక్టర్ కొరటాల శివ టీమ్ నుంచి మరో అప్డేట్.. బాలకృష్ణ సినిమా తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏదంటే?
బాలకృష్ణతో సినిమా తర్వాత డైరెక్టర్ కొరటా శివ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్టుపై అప్డేట్ ఇచ్చారు టీమ్.

దిశ, సినిమా: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు ఓకే చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఆయన ప్రజెంట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK111’ తో బిజీగా ఉన్నా విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నా బాలయ్య తన నెక్ట్స్ ప్రాజెక్టు ‘NBK-112’ కోసం సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివతో చేతిలు కలిపినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై టీమ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
‘శక్తి లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు, జనసమూహం ఒక ఉద్యమంగా మారుతుంది.. తారలు అనుకూలించాయి. ఒక పండుగ వేచి ఉంది’ అనే పవర్ ఫుల్ క్యాప్షన్ ఇచ్చిన షేర్ చేసిన అఫీషియల్ పోస్ట్ ప్రజెంట్ నెట్టింట నందమూరి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. బాలకృష్ణతో సినిమా అనౌన్స్‌మెంట్ రావడంతో ఎన్టీఆర్ ‘దేవర 2’ ఇక లేనట్టేనా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే దేవర 2పై కొరటాల శివ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ‘NBKxKoratalaSiva త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ మొదలైన 7 నెలల్లోపే సినిమాను పూర్తి చేయాలని శివ గారు కోరుకుంటున్నారు. అది పూర్తయ్యాక, ఆయన నేరుగా NTR తో Devara2 తెరకెక్కిస్తారు’ అంటూ తెలిపారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






