దేవ‌ర 2 సైడ్‌...మ‌రో నంద‌మూరి హీరోతో కొర‌టాల శివ ఊర మాస్ సినిమా ?

by velandi.Saikiran |

బాలయ్యతో ( Balakrishna ) పొలిటికల్ డ్రామా చేసేందుకు కొరటాల శివ ప్రయత్నాలు చేస్తున్నారట.

దేవ‌ర 2 సైడ్‌...మ‌రో నంద‌మూరి హీరోతో కొర‌టాల శివ ఊర మాస్ సినిమా ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ దర్శకులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంత మంది దర్శకులు 100% సక్సెస్ రేట్ తో దూసుకు వెళ్తున్నారు. అలాంటి వారిలో కొరటాల శివ ఒకరు. కొరటాల శివ సినిమా చేశారంటే కచ్చితంగా హిట్ కావాల్సిందే. మిర్చి సినిమాతో ద‌ర్శ‌కుడిగా తొలి స‌క్సెస్ అందుకున్న కొర‌టాల శివ‌, ఆ త‌ర్వాత శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌, భ‌ర‌త్ అనే నేను లాంటి మేసేజ్ ఇచ్చే సినిమాలు తీసి, దుమ్ములేపారు. అయితే, ఆచార్య సినిమా మాత్రం కొర‌టాల శివ స్పీడ్ కు బ్రేకులు వేసింది.

ఇక ఇటీవల జూనియ‌ర్ ఎన్టీఆర్ ( NTR ) హీరోగా దేవర సినిమా చేశారు. ఈ మూవీతో మ‌రోసారి మంచి సక్సెస్ అందుకున్నారు కొరటాల శివ. త్వరలో దేవర 2 సినిమా కూడా రాబోతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇతర సినిమాలు ఒప్పుకోవడంతో, కొరటాల శివకు డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు. అందుకే దేవర 2 కొన్ని రోజుల పాటు పక్కకు పెట్టి, కొత్త హీరో కోసం సెర్చ్ చేస్తున్నారట దర్శకుడు కొరటాల శివ.

ఇందులో భాగంగానే నందమూరి బాలయ్య పై (Nandamuri Balakrishna ) కన్నేశారట. అప్పట్లోనే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న‌ట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇటు మరోసారి అదే అంశం తెరపైకి వచ్చింది. బాలయ్యతో ( Balakrishna ) పొలిటికల్ డ్రామా చేసేందుకు కొరటాల శివ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ సినిమా పూర్తి చేసే వరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్రీ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఆలోపు బాలయ్యతో సినిమా చేయాలన్నది కొరటాల శివ ప్లాన్. ఈ మేరకు బాలయ్య తో కూడా చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని ఓకే అయితే త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుంది. నిజంగానే బాల‌య్య‌తో కొరటాల శివ సినిమా ఓకే అయితే, థియేట‌ర్లు బద్ద‌లు కావ‌డం గ్యారెంటీ అంటున్నారు.

Next Story