- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kona Venkat: చనిపోదామని డిసైడ్ అయ్యా.. ఆరోజు ఆ అమ్మాయిని చూడకపోతే నేను ఉండేవాడిని కాదు
కోన వెంకట్ మాట్లాడుతూ... ఓ రోజు చనిపోదామని బీచ్‌కు వెళ్లాను. కానీ ఆమెనే నా జీవితాన్ని మార్చింది... ఎమోషనల్ అయిన కోన వెంకట్.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కథ రచయిత కోన వెంకట్ తాజాగా రోషన్ , శ్రీదేవి జంటగా రూపొందిన బ్యాండ్ మేళం చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ మార్చ్ 26న విడుదలై ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి మూవీ బృందం నిన్న రాత్రి థ్యాంక్స్ మీట్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కోన వెంకట్ తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
కోన వెంకట్ మాట్లాడుతూ… “నా జీవితంలో నేను మొదట ఒక అమ్మాయికి థాంక్స్ చెప్పాలి. ఆ అమ్మాయికి రెండు చేతులు, రెండు కాళ్లు లేవు. ఆమె చెన్నై బీచ్‌లో హార్ట్ షేప్ బెలూన్స్ అమ్ముతూ నాకు కనిపించింది. ఆమె సోదరుడు అనుకుంటా ఆమెను వీల్‌చెయిర్‌లో కూర్చోబెట్టి ముందుకు చూస్తున్నాడు. కానీ ఆమె మాత్రం చిరునవ్వుతో ‘అన్నా బెలూన్ కొనండి’ అంటూ అందరిని పిలుస్తుంది. ఆ సమయంలో నేను ఆ బీచ్‌కు చనిపోదామని వెళ్లాను. 50 నిద్రమాత్రలు కొనుక్కొని, నా దగ్గర మిగిలిన చివరి డబ్బుతో ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేశాను. ఆ మాత్రలు మింగి, నీళ్లు తాగి చనిపోవాలని అనుకున్నాను.
కానీ ఆ అమ్మాయిని చూసిన తర్వాత నా నిర్ణయం మారిపోయింది. రెండు చేతులు, రెండు కాళ్లు లేకపోయినా జీవితం కోసం పోరాడుతున్న ఆమెను చూసి, ‘నేనెందుకు చనిపోవాలి… ఫైట్ చేస్తే తప్పకుండా గెలుస్తాం’ అనిపించింది. ఆ సంఘటన 1997లో జరిగింది. ఆ తర్వాత నేను ఎన్నో సినిమాలకు పనిచేసి సక్సెస్ సాధించాను. నేను సక్సెస్ అయిన తర్వాత ఎన్నోసార్లు ఆ బీచ్‌కి వెళ్లి ఆ అమ్మాయి కోసం వెతికాను. కానీ ఆమె ఎప్పుడూ కనిపించలేదు. నేను ఈ స్థాయికి రావడానికి ఆ అమ్మాయి కారణం. ఆమె లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు” అంటూ కోన వెంకట్ భావోద్వేగానికి గురయ్యారు.






