'అదుర్స్ 2'కి అంతా రెడీ.. ఆయన టైం ఇవ్వడమే ఆలస్యం.. కోనా వెంకట్

by Pulgam srinivas |

అదుర్స్ 2 గురించి కోన వెంకట్ మాట్లాడుతూ... ఇప్పటికే అదుర్స్ 2 స్క్రిప్ట్ మొత్తం పూర్తయింది. వినాయక్ గారు కూడా కథ గురించి అడిగారు. తారక్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఆయన కాస్త ఫ్రీ కాగానే ఈ సినిమా పని ప్రారంభిస్తాం అని కోన వెంకట్ అన్నారు.

అదుర్స్ 2కి అంతా రెడీ.. ఆయన టైం ఇవ్వడమే ఆలస్యం.. కోనా వెంకట్
X

దిశ, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ కి మంచి గుర్తింపును తీసుకువచ్చిన పాత్రలలో అదుర్స్ చిత్రంలోని చారి పాత్ర ఒకటి. ఈ సినిమాలో చారి పాత్రలో బ్రాహ్మణ యువకుడిగా నటించిన తారక్ అద్భుతమైన నటనతో, డైలాగ్ డెలివరీతో సూపర్ గా కామెడీని పండించాడు. 2010వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తారక్ 'అదుర్స్"లో డబుల్ రోల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. నయనతార, షీలా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించగా, వి.వి. వినాయక్ దర్శకత్వం వహించాడు.

కోన వెంకట్ ఈ సినిమాకు కథను అందించడం మాత్రమే కాకుండా స్క్రీన్ ప్లేలో కూడా భాగం పంచుకున్నాడు. తారక్ కెరీర్లోనే అద్భుతమైన సినిమా కావడంతో అనేకమంది అదుర్స్ మూవీకి సీక్వెల్ వస్తే బాగుంటుందని ఈ మూవీ బృందాన్ని అనేక సందర్భాలలో అడిగారు. దాంతో ఈ మూవీ రైటర్ కమ్ స్క్రీన్ ప్లే రైటర్ అయినటువంటి కోన వెంకట్ గతంలో అదుర్స్ 2 స్క్రిప్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అని అన్నారు. దాంతో ఎప్పుడెప్పుడు అదుర్స్ 2 కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా అని అనేకమంది తారక్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూడటం మొదలుపెట్టారు.

తాజాగా కోన వెంకట్ ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో ఆయనకు అదుర్స్ 2 స్క్రిప్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన సమాధానం చెబుతూ.. అదుర్స్ 2 స్క్రిప్ట్ ఇప్పటికే మొత్తం కంప్లీట్ అయింది. వినాయక్ గారు కూడా ఈ మధ్య ఒకసారి కలిస్తే అదుర్స్ 2 గురించి అడిగారు. ప్రస్తుతం తారక్ చాలా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన కాస్త ఫ్రీ అయితే ఈ సినిమా ప్రయత్నాలు మొదలుపెడతాం అని కోన వెంకట్ తెలియజేశారు.

Next Story