ఇండస్ట్రీని వదిలేస్తున్న కుర్ర హీరోయిన్.. చెంప చెల్లుమనిపించే పోస్ట్‌తో వారికి సమాధానం

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-02 08:41:02  IST  )

యూనిక్ కంటెంట్‌తో ఎంటర్‌టైన్ చేస్తున్న కోమలి ప్రసాద్.. హీరోయిన్‌గా, సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా మంచి పేరు సంపాదించుకుంది. త్వరలోనే శశివదనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే డాక్టర్ అయిన ఆమె ఇండస్ట్రీని వదిలిపోతుందని..

ఇండస్ట్రీని వదిలేస్తున్న కుర్ర హీరోయిన్.. చెంప చెల్లుమనిపించే పోస్ట్‌తో వారికి సమాధానం
X

దిశ, వెబ్‌డెస్క్ : యూనిక్ కంటెంట్‌తో ఎంటర్‌టైన్ చేస్తున్న కోమలి ప్రసాద్.. హీరోయిన్‌గా, సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా మంచి పేరు సంపాదించుకుంది. త్వరలోనే శశివదనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే డాక్టర్ అయిన ఆమె ఇండస్ట్రీని వదిలిపోతుందని.. యాక్టింగ్ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టేస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో ఆమె క్లారిటీ ఇస్తూ పోస్ట్ పెట్టింది.

‘అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అయ్యానని, నటనకు పూర్తిగా దూరం అయ్యానంటూ అసత్య ప్రచారాలు, తప్పుదోవ పట్టించే వార్తల్ని ప్రచురిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ రూమర్లను నిజం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని అందరికీ స్పష్టంగా తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎంతో కష్టపడి ఇప్పటి వరకు సినిమాల్లో కెరీర్‌ను కొనసాగిస్తూ ఈ స్థాయి వరకు వచ్చాను. ఆ శివుని ఆశీస్సులతో నా కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నాను.

నాలో, నా శ్రేయోభిలాషులలో అనవసరమైన ఆందోళనలను రేకెత్తించేలా ఈ రూమర్లను ప్రచారం చేస్తున్నారు. ఇలా తప్పుదారి పట్టించే సమాచారం వ్యాప్తి చెందకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ స్పష్టతనిస్తూ పోస్ట్ వేస్తున్నాను. ఆ విధే నన్ను ఈ మార్గంలోకి తీసుకు వచ్చిందని నేను భావిస్తుంటాను. చివరి శ్వాస వరకు నటిగా నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నా వెన్నెంటే ఉన్న నా శ్రేయోభిలాషులందరికీ, నా కంటే నన్ను ఎక్కువగా నమ్మిన వారందరికీ ధన్యవాదాలు. నేను ప్రస్తుతం నా స్క్రిప్ట్‌లను జాగ్రత్తగా ఎంచుకుంటున్నాను. త్వరలో కొత్త ప్రకటనలతో మీ అందరినీ చాలా గర్వపడేలా చేస్తాను’ అని కోమలి ప్రసాద్ అన్నారు.

Next Story