- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు మృతి
ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, నటుడు వేలు ప్రభాకరన్(Velu prabhakaran) (68) నేడు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన గత కొన్ని వారాలుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ కొట్టివాక్కంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నెలలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు సంభవించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించారు. అయితే చికిత్స ఫలించక శుక్రవారం ఉదయం 5:30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. వేలు ప్రభాకరన్ 1980లో 'ఇవర్గల్ విద్యాసమనవర్గల్' చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.
1989లో 'నాలయ మనితన్' చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి, 'అధిసయ మనితన్', 'కడవుల్', 'సివన్', 'పురట్చిక్కారన్' వంటి చిత్రాలను రూపొందించారు. 'కడవుల్' చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా తమిళనాడు రాష్ట్ర అవార్డును గెలుచుకున్నారు. ఆయన చిత్రాలు నాస్తికత్వం, విప్లవాత్మక, వివాదాస్పద అంశాలతో నిండి ప్రసిద్ధి చెందాయి. నటుడిగా 'గ్యాంగ్స్ ఆఫ్ మద్రాస్', 'కడావర్', 'గజానా' వంటి చిత్రాల్లో నటించారు. ఆయన మృతదేహాన్ని ఎల్లుండి మధ్యాహ్నం వరకు చెన్నైలోని వలసరవక్కంలోని ఆయన నివాసంలో సందర్శకుల కోసం ఉంచనున్నారు. అనంతరం పోరూర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. వేలు ప్రభాకరన్ మృతికి తమిళ చిత్ర పరిశ్రమలోని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి అర్పించారు.






