చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబానికి అండగా ప్రభుత్వం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-17 12:48:15  IST  )

తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం దొండవాక పంచాయతీ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆచూకీ ఇంకా అంతుచిక్కకుంది....

చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబానికి అండగా ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) తుని నియోజకవర్గం(Tuni Constituency) దొండవాక పంచాయతీ అగ్రహారం(Dondavaka Panchayat Agraharam)లో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆచూకీ ఇంకా అంతుచిక్కకుంది. ఇప్పటివరకూ తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు విలవిలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలబడింది. ఈ మేరకు హోంమంత్రి అనిత బుధవారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ చిన్నారి అదృశ్యం అత్యంత బాధాకరమని చెప్పారు. కన్నబిడ్డ దూరమై ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతమని ఆమె పేర్కొన్నారు. పాప అదృశ్యాన్ని ఛేదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని, అప్పటి నుంచి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ 11 రోజులుగా ప్రత్యేక పోలీస్ బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పాపను తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు ఏ ఒక్క మార్గాన్ని వదలకుండా ప్రయత్నిస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు.

Next Story