- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mega 158: మెగా 158లో కోలీవుడ్ స్టార్.. వైరల్‌గా పోస్ట్
ప్రజెంట్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి.

దిశ, సినిమా: ప్రజెంట్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈమూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం సంక్రాంతి స్పెషల్‌గా వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీతో పాటు మెగాస్టార్ తన 158వ చిత్రాన్ని కూడా ఇటీవల అఫీషియల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించబోతున్నది. మెగాస్టార్ చిత్రంతోనే కేవీఎన్ ప్రొడక్షన్స్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం.
‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ నవంబర్ నెలకరు నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో ఓ స్టార్ హీరో కూడా భాగం కాబోతున్నట్లు ప్రజెంట్ వార్తలు ఊపందుకున్నాయి. ఈ మేరకు ‘మెగా 158’ లో కోలీవుడ్ స్టార్ కార్తీ చిరంజీవితో కలిసి వర్క్ చేయనున్నాడట. పూర్తి గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో కార్తీ.. చిరంజీవితో పాటు ఫుల్ లెంత్ పాత్ర చేయబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల నుంచి వార్తలు వస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లింక్






