Hit-3: హిట్-3లో కోలీవుడ్ స్టార్ హీరో.. హైప్ పెంచేస్తున్న న్యూస్

by Chukka Sudharani |

నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ (Hit-3).

Hit-3: హిట్-3లో కోలీవుడ్ స్టార్ హీరో.. హైప్ పెంచేస్తున్న న్యూస్
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ (Hit-3). హిట్ ఫ్రాంచైజీలో రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ (Teaser), ఫస్ట్ లుక్ వంటి అప్‌డేట్ ఆకట్టుకోగా.. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాల ఉన్నాయి. శైలేష్ కొలను (Sailesh Kolanu) డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ‘హిట్-3’లో నాని అర్జున్ సర్కార్ (Arjun Sarkar) అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అలాగే ఫస్ట్ లుక్ గ్లింప్స్‌లో నాని పర్ఫామెన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా కావడంతో.. ఎప్పుడెప్పుడు ఈ మూవీ స్క్రీన్‌పై చూద్దామా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇక భారీ అంచనాల మధ్య ఈమూవీ మే 1న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో.. ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్‌(Musical promotions)లో భాగంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ (First single) ‘ప్రేమ వెల్లువ’ కూడా సోషల్ మీడియాలో మంచి స్పందన సొంతం చేసుకుంది. దీంతో మూవీపై మరిన్ని అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో సూపర్ న్యూస్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కోలీవుడ్ (Kollywood) స్టార్ కార్తీ (Karthi) కామియో రోల్‌(Cameo role)లో కనిపించనున్నాడని తెలుస్తుంది. అంతే కాకుండా.. ఇందులో కార్తీ పాత్ర కనిపించేది కొద్దిసేపే అయినా చాలా ప్రధానంగా ఉండనుందని తెలుస్తోంది. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా.. హిట్-3 లో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యూనిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.

Next Story