- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నష్టాలు తగ్గించేందుకు మాస్టర్ ప్లాన్.. కొత్త రూల్స్ పాస్ చేసిన నిర్మాతల మండలి
నష్టాలను తగ్గించే దిశగా తమిళ నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది.

దిశ, సినిమా: నష్టాలను తగ్గించే దిశగా తమిళ నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి స్టార్ హీరోలు, టెక్నీషియన్లు ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్‌కు బదులు రెవెన్యూ షేరింగ్ మోడల్‌లో పని చేయాల్సిందే అని తెలిపింది. సినిమా హిట్ అయితే లాభం, ఫ్లాప్ అయితే నష్టం కూడా షేర్ చేసుకోవాలని దీని ముఖ్య ఉద్దేశ్యం. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, ధనుష్ లాంటి టాప్ స్టార్లను ఈ మోడల్‌కు సహకరించాలని కోరారు. అంతేకాదు, OTT రిలీజ్‌పై కూడా కఠిన రూల్స్ పెట్టారు. పెద్ద బడ్జెట్ స్టార్ సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయిన 8 వారాల తర్వాత, మిడ్-రేంజ్ సినిమాలకు 6 వారాలు, చిన్న సినిమాలకు 4 వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. బాక్సాఫీస్ రెవెన్యూ కాపాడేందుకే ఈ నిర్ణయం అంటున్న TFPC.. ఇంకా 22 కీలక తీర్మానాలు పాస్ చేశారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరికేలా ‘Film Release Regulation Committee’ ఏర్పాటు, టికెట్ బుకింగ్‌పై సర్వీస్ ఛార్జీలు తగ్గించేందుకు ప్రభుత్వ బుకింగ్ ప్లాట్‌ఫామ్ డిమాండ్, అనధికార అవార్డ్ ఫంక్షన్లు & YouTube రివ్యూలపై యాక్షన్, నటీనటులు వెబ్ సిరీస్‌ల కంటే సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరారు. నిర్మాతల డిమాండ్లకు నటీనటుల సంఘం స్పందించకపోతే మే 2న టోకెన్ స్ట్రైక్, అవసరమైతే నిరవధిక సమ్మెకి కూడా రెడీ అంటున్నారు






