సంచలన నిర్ణయం తీసుకున్న కోలీవుడ్ ఇండస్ట్రీ

by Pulgam srinivas |

కోలీవుడ్ నిర్మాతల మండలి స్టార్ హీరోల పారితోషకం మరియు ఓటీటీ డీల్స్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.

సంచలన నిర్ణయం తీసుకున్న కోలీవుడ్ ఇండస్ట్రీ
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ ఇండస్ట్రీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ బడ్జెట్‌తో రూపొందే చిత్రాల విషయంలో కోలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రోజులుగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందే సినిమాల్లో నటించే స్టార్ హీరోలు పారితోషకం ముందుగానే పూర్తిగా తీసుకోవడం కాకుండా, సినిమా విడుదలైన తర్వాత వచ్చే రెవిన్యూలో కొంత శాతం తీసుకుంటే బాగుంటుందని ప్రతిపాదిస్తున్నారు. ఇలా జరిగితే నిర్మాతలకు ఉపశమనం లభించడమే కాకుండా, సినిమా పరిశ్రమ కూడా ఆరోగ్యంగా కొనసాగుతుందని చాలా రోజులుగా సూచనలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై కోలీవుడ్ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కోలీవుడ్ నిర్మాతల మండలి ఈ నిర్ణయాన్ని మొదటిసారి తీసుకోలేదు.

గతంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ, అది ఆచరణలో సాధ్యం కాలేదు. ఈ విషయంతో పాటు ఓటీటీ డీల్ విషయంలో కూడా నిర్మాతల మండలి మరో నిర్ణయం తీసుకుంది. స్టార్ హీరోలు నటించిన సినిమాలను చాలా తక్కువ రోజుల్లో ఓటీటీలోకి తీసుకురాకుండా, కనీసం 6 నుంచి 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల చేయాలని ప్రతిపాదించింది. అయితే ఈ సూచనలకు స్టార్ హీరోలు ఒప్పుకుంటారా లేదా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. వారు అంగీకరిస్తేనే ఈ ప్రతిపాదనలు సజావుగా అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మరి కోలీవుడ్ ఇండస్ట్రీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.

Next Story