- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దీపావళికి కోలీవుడ్ బాక్సాఫీస్ బ్లాస్ట్.. రజనీ-ధనుష్ మధ్య బిగ్ ఫైట్
ఈ దీపావళికి 'జైలర్ 2', 'ధనుష్ 55' చిత్రాలు బాక్సాఫీస్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది దీపావళికి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని కోలీవుడ్ వర్గాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్ 2' చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో పాటు పలువురు ప్రముఖులు క్యామియో పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ధనుష్ కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ధనుష్ 55' చిత్రాన్ని కూడా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు చిత్రాలపై కూడా కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే తమిళ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ రెండు చిత్రాలు నిజంగానే దీపావళి బరిలో తలపడతాయా? లేక విడుదల తేదీల్లో మార్పులు చేసి వేర్వేరు సీజన్లలో ప్రేక్షకుల ముందుకు వస్తాయా? అనే విషయం ప్రస్తుతం కోలీవుడ్ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.






