- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Santhanam: నటుడిపై కేసు నమోదు.. రోడ్డు మీద పోయే వారికి సమాధానమివ్వనంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ షాకింగ్ కామెంట్స్
కోలీవుడ్ నటుడు సంతానం(Santhanam)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: కోలీవుడ్ నటుడు సంతానం(Santhanam)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. కమెడియన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. కమెడియన్ వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్ పీక్స్‌లో ఉండగానే హీరోగా మారాడు. ప్రస్తుతం సంతానం నటిస్తున్న తాజా చిత్రం ‘డీడీ నెక్ట్స్ లెవల్’(DD Next Level). గతంలో వచ్చిన డీడీ, డీడీ రిటర్న్స్ సినిమాలకు కొనసాగింపుగా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. కామెడీ హారర్ చిత్రం, ఇది S. ప్రేమ్ ఆనంద్(Prem Anand) దర్శకత్వంలో తెరకెక్కింది.ది షో పీపుల్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ చిత్రంలో గీతిక తివారీ, సెల్వరాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్‌లు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమామే 16న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు.
అయితే ఇందులో శ్రీనివాస గోవింద పాటని పేరడీ చేయడం వివాదానికి దారి తీసింది. దీనిపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ఈ పాటని వెంటనే తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ‘డీడీ నెక్స్ట్ లెవల్’ సినిమా పాటపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ‘డీడీ నెక్స్ట్ లెవల్’ ప్రమోషన్స్‌లో భాగంగా సంతానం వివాదంపై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘తిరుమల శ్రీవారిని మేం అవమానించలేదు. సెన్సార్ బోర్డ్ నిబంధనల మేరకు సినిమా తీశాం. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడుతారు. అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడని అంటున్నారు. అలాగే పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందోనని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






