కొక్కొరొకో సినిమాతో ప్రముఖ కళాకారిణి వెండితెర అరంగేట్రం

by Sujitha Rachapalli |

ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘కొక్కొరోకో’. నీలాద్రి ప్రొడక్షన్ సమర్పణలో, RV ఫిల్మ్ హౌస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

కొక్కొరొకో సినిమాతో ప్రముఖ కళాకారిణి వెండితెర అరంగేట్రం
X

దిశ, సినిమా : ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘కొక్కొరోకో’. నీలాద్రి ప్రొడక్షన్ సమర్పణలో, RV ఫిల్మ్ హౌస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా పరిచయం కాబోతుండగా.. మూవీ షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించింది మూవీ యూనిట్. సంప్రదాయ కోడిపందాల నేపథ్యం చుట్టూ తిరిగే కథతో.. ఐదు విభిన్న పాత్రలతో రూపొందిన అంథాలజీ చిత్రంగా ‘కొక్కొరోకో’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కథ–స్క్రీన్ ప్లేను రమేష్ వర్మ అందించగా.. బలమైన విజువల్స్‌తో పాటు భావోద్వేగాత్మక కథనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రంలో మరో ముఖ్య విశేషం ఏమిటంటే…

మనస్విని బాలబొమ్మల అనే ప్రతిభావంతమైన కళాకారిణి ఈ చిత్రంతో సినీ అరంగేట్రం చేయనుంది. గెస్ట్ రోల్‌లో కనిపించనున్న ఆమె.. థియేటర్‌లో శిక్షణ పొందిన నటి. అంతేకాదు ఆమె సంప్రదాయ పేర్ని నాట్యం, కర్ణాటక సంగీతంలోనూ ప్రావీణ్యం కలిగి ఉంది. Glendale Academyలో భక్తిగీత ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు పలు ముఖ్యమైన ఈవెంట్స్‌కు యాంకర్‌గా కూడా వ్యవహరించింది. కాగా ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది మూవీ యూనిట్.

Next Story