- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KJQ ట్రైలర్ విడుదల తేదీ ఫిక్స్
KJQ మూవీ ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: దీక్షిత్ శెట్టి, శశి ఒదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం KJQ (కింగ్ జాకీ క్వీన్). కె.కె. (కిరణ్ కుమార్) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై నిర్మించారు. పూర్ణచంద్ర తేజస్వి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను ఆగస్టు 7, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్ర బృందం తాజాగా ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ను ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఇక రేపు విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.






