- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిస్ యు రా అంటూ కన్నీళ్లు తెప్పిస్తున్న కితకితలు యాక్టర్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ గీతా సింగ్(Geetha Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ యాక్టర్ గీతా సింగ్(Geetha Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2005లో ‘ఎవడి గోల వాడిదే’(Evadigola Vadidhe) సినిమాతో లేడీ కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైందీ బొద్దుగుమ్మ. ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించి ఆడియన్స్‌ను అలరించింది. ఆ తర్వాత ‘ప్రేమాభిషేకం’(Premabhishekam), ‘దొంగల బండి’(Dongala Bandi), ‘శశిరేఖా పరిణయం’(Sasirekha Parinayam), ‘ఆకాశ రామన్న’(Akasha Ramanna), ‘సీమ టపాకాయ్’(Seema Tapakai), ‘కెవ్వు కేక’(Kevvu Keka), ‘కళ్యాణ వైభోగమే’(Kalyana Vaibhogame), ‘రెడ్’ Red), ‘జంప్ జిలానీ’(Jump Jilani), ‘సరైనోడు’(Sarrainodu), ‘ఈడోరకం ఆడోరకం’(Eedorakam Aadorakam), ‘తెనాలి రామకృష్ణ’(Tenali Ramakrishna) తదితర హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది.
అయితే గత కొంత కాలంగా గీతా సింగ్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. 2019 తర్వాత కేవలం రెండు సినిమాల్లో మాత్రమే ఈ బొద్దుగుమ్మ కనిపించడం గమనార్హం. ఇదిలా ఉంటే సుమారు రెండేళ్ల క్రితం గీతా సింగ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. చేతికి అందివచ్చిన కుమారుడు సడెన్‌గా యాక్సిడెంట్‌లో చనిపోవడంతో గీతా సింగ్ కోలుకోలేకపోయింది.
అయితే తాజాగా నేడు (గురువారం (ఫిబ్రవరి 18)) గీతాసింగ్ కుమారుడి వర్ధంతి. ఈ సందర్భంగా తన కొడుకుకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘తన కొడుకు తనతో ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ.. మిస్ యు రా’ అంటూ భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు గీతా సింగ్‌కు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. చేతికందొచ్చిన కుమారుడు లేనడే విషయం తల్చుకుని పెట్టిన ఆమె ఎమోషనల్ పోస్ట్‌ను చూస్తుంటే కన్నీళ్లు రాకమానట్లేవు.






