- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sidhu Jonnalagadda: ఫస్ట్ టైమ్ ముద్దు గుర్తిండిపోవాలి.. వైరల్‌గా హీరోయిన్ వైష్ణవి కిస్ వీడియో
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda), క్యూట్ బ్యూటీ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్- కొంచెం క్రాక్’

దిశ, సినిమా: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda), క్యూట్ బ్యూటీ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్- కొంచెం క్రాక్’ (JACK Konchem Krack). బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మిస్తోంది. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ‘జాక్’ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే వరుస అప్‌డేట్స్ (Updates) ఇస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ‘కిస్ సాంగ్’ (Kiss Song) రాబోతున్నట్లు ప్రకటించారు.
‘ఎమోషనల్ కలర్స్ అందమైన ప్రేమ ప్రయాణంలో కలిసిపోతాయి.. ‘జాక్’ నుంచి కిస్ సాంగ్ మార్చి 17న రాబోతుంది’ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇక వీడియో స్టార్టింగ్‌లోనే హీరో సిద్ధు, హీరోయిన్ వైష్ణవి చైతన్య ఓ రెస్టారెంట్(Restaurant)లో ఉంటారు. అప్పుడు వైష్ణవి సిద్ధుకి దగ్గరగా వచ్చి ‘నువ్వు నమ్మాలంటే ఏం చెయ్యాలో చెప్పు చేస్తా’ అంటుంది. సిద్ధు.. ‘నువ్వు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో.. ఒక్కసారి కమిట్ అయితే లైఫ్ లాంగ్ ఉండిపోతా నేను’ అంటాడు. ఇలా హీరో, హీరోయిన్‌లా మధ్య రొమాంటిక్‌గా సాగే ఈ వీడియోలో హీరోయిన్ ‘ఫస్ట్ టైమ్ ముద్దు.. గుర్తిండిపోవాలి’ అని అంటుంది. దీంతో హీరో ఈ హైదరాబాద్ (Hyderabad) మొత్తంలో ముద్దు పెట్టుకుంటాకి నాకంటూ ఓ ప్రైవేట్ ప్లేస్ లేదా అని వీడియో క్లోజ్ అవుతుంది. ఇక దీనికి కంటిన్యూషన్(Continuation)గా ఈ ‘కిస్ సాంగ్’ ఉండబోతున్నట్లు అర్థం కాగా.. ప్రజెంట్ ఈ వీడియో క్యూట్‌గా వైరల్ అవుతోంది






