- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishore Tirumala: ఆ ఒక్క సాంగ్ తో థియేటర్‌లో గుద్దుడే గుద్దుడు
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలోని సీరియల్ డిజె సాంగ్ అద్భుతంగా వచ్చిందని పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి ( Bhartha Mahasayulaku Wignyapthi). సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా దూసుకు వెళ్తోంది. సినిమా మొత్తం కామెడీతో నింపేశాడట దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ తరుణంలో సినిమాకు వెళ్లిన ప్రతి ఒక్కరూ రెండున్నర గంటల పాటు కడుపుబ్బా నవ్వేసుకున్నారట.
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రవితేజ ఇజ్ బ్యాక్ అంటున్నారు. దానికి తగ్గట్టుగానే థియేటర్లు కూడా హౌజ్ ఫుల్ అవుతున్నాయి. సినిమా సక్సెస్ టాక్ రావడంతో...స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ మూవీలో రవితేజ ఇరగదీసాడని కొనియాడారు.
ముఖ్యంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలోని సీరియల్ డిజె సాంగ్ అద్భుతంగా వచ్చిందని పేర్కొన్నారు. ఈ సాంగ్ రాగానే థియేటర్ లో గుద్ధుడే గుద్దుడు అంటూ బోల్డ్ కామెంట్స్ కూడా చేశారు దర్శకుడు కిషోర్ తిరుమల. కాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో రవితేజ హీరోగా చేయగా డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ ఇరగదీసారు. సునీల్ ప్రత్యేక పాత్రలో కనిపించారు.






