‘కిష్కింధపురి’ టీజర్ అప్‌డేట్.. సువర్ణమాయ రేడియో స్టేషన్ మీ రాక కోసం ఎదురు చూస్తుందంటూ పోస్ట్..

by I. Sairam |   (  Updated:2025-08-14 08:10:45  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘కిష్కింధ పురి’(Kiskindhapuri).

‘కిష్కింధపురి’ టీజర్ అప్‌డేట్.. సువర్ణమాయ రేడియో స్టేషన్ మీ రాక కోసం ఎదురు చూస్తుందంటూ పోస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘కిష్కింధ పురి’(Kiskindhapuri). హారర్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి ‘చావు కబురు చల్లగా’ డైరెక్టర్ కౌషిక్ పెగల్లపతి(Koushik Pegallapathi) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, అర్చన ప్రజెంట్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి టీజర్(Teaser) రాబోతుందని స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘సువర్ణమాయ రేడియో స్టేషన్ మీ రాక కోసం ఎదురు చూస్తుంది.. కిష్కింద పూరి టీజర్ ఆగస్టు 15 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రాబోతుంది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

లింక్

Also Read..

మరో వివాదంలో మృణాల్ ఠాకూర్..

Next Story