మే నుండి స్టార్ట్ కానున్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ'

by Pulgam srinivas |

‘రియాలిటీ’ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను మే నెలలో ప్రారంభించి, దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కిరణ్ అబ్బవరం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మే నుండి స్టార్ట్ కానున్న కిరణ్ అబ్బవరం రియాలిటీ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయన ఇప్పటికే నిర్మాతగా కూడా మారారు. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ మూవీని ఏప్రిల్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఇలా ఇప్పటికే నటుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఈ యువ హీరో మరికొన్ని రోజుల్లో దర్శకుడిగా కూడా ఓ సినిమాను రూపొందించబోతున్నాడు. ఈ యువ నటుడు ‘రియాలిటీ’ అనే టైటిల్‌తో ఓ సినిమాను రూపొందించడానికి రెడీ అయ్యాడు.

ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను మే నెల నుండి ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో కిరణ్ అబ్బవరం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈయన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రచారాలలో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే కిరణ్ అబ్బవరం‌కు నిర్మాతగా కూడా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story