- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ‘కే-ర్యాంప్’కు పోటీగా మరో యంగ్ హీరో సినిమా రిలీజ్..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటిస్తున్న తాజా చిత్రం ‘కే-ర్యాంప్’ (K-Ramp).

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటిస్తున్న తాజా చిత్రం ‘కే-ర్యాంప్’ (K-Ramp). జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మక్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి కిరణ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు.. సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ‘కే-ర్యాంప్’ మూవీ 2025 దివాళీ స్పెషల్‌గా రాబోతున్నట్లు తెలిపారు. దీంతో కిరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకు పోటీగా మరో చిత్రం రిలీజ్‌కు రాబోతుంది.
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ప్రస్తుతం వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో ‘డ్యూడ్’ (Dude) ఒకటి. కీర్తి శ్వరన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా కూడా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2025 దీపావళి కానుకగా విడుదల కాబోతుందని ఇప్పటికే మూవీ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ ‘కే-ర్యాంప్’ అండ్ ‘డ్యూడ్’కు సంబంధించిన రెండు పోస్టర్లు షేర్ చేస్తూ.. దీపావళికి బాక్సాఫీస్ వద్దా పోరు షురూ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.






