Kiran Abbavaram: ప్రేక్షకులకు కిరణ్ అబ్బవరం క్రేజీ ఆఫర్.. అది కనిపెడితే బైక్ ఫ్రీ

by Yella Dhawani Reddy |   (  Updated:2025-03-03 12:12:21  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Kiran Abbavaram: ప్రేక్షకులకు కిరణ్ అబ్బవరం క్రేజీ ఆఫర్.. అది కనిపెడితే బైక్ ఫ్రీ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'క' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌ బస్టర్ విజయాన్ని (Blockbuster success) సొంతచేసుకున్నారు. ఇక ఇప్పుడు 'దిల్ రుబా' మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు. విశ్వ కరుణ్ (Vishwa Karun) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 14న హోళీ పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు క్రేజీ ఆఫర్ ప్రకటించారు.

'దిల్ రుబా' చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి విడుదలైన వీడియోలు చూసి సినిమా జోనర్ ఏంటో క్రియేటివ్‌గా గెస్ చేసిన వారికి సినిమాలో హీరో వాడిన కస్టమైజ్డ్‌ బైక్‌ను బహుమతిగా అందించనున్నారు. అంతేకాదు, మూవీ ఫస్ట్ డే, ఫస్ట్ షో హీరోతో కలిసి చూసే అవకాశాన్ని పొందవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఇక ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోన్నారు. శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా, ఈ సినిమాను మొదట వాలంటైన్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, అనుకోని కారణాల వలన వాయిదా వేస్తూ వచ్చారు.

Next Story