Kiran Abbavaram : తండ్రైన తెలుగు హీరో

by Muthe.Rajitha |

మరో టాలీవుడ్ యంగ్ హీరో తండ్రి అయ్యాడు.

Kiran Abbavaram : తండ్రైన తెలుగు హీరో
X

దిశ, వెబ్ డెస్క్ : మరో టాలీవుడ్ యంగ్ హీరో తండ్రి అయ్యాడు. జయపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న తెలుగు హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) గురువారం సాయంత్రం ఓ బిడ్డకు తండ్రి(Father Hood) అయ్యాడు. ఆయన భార్య రహస్య గోరఖ్(Rahasya Gorakh) కొద్దిసేపటిక్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. తనకు చాలా ఇష్టమైన దేవుడు హనుమంతుడని, ఆయన పుట్టినరోజునే మా ఇంట కొడుకు జన్మించడం స్వయంగా హనుమంతుడే మా ఇంటికి వచ్చినట్టు ఉందని పేర్కొన్నాడు.

హనుమాన్ జయంతి(Hnuman Jayanthi) రోజునే తండ్రిని అవడం సంతోషంగా ఉందని.. జై శ్రీరామ్ అంటూ కొడుకు కాళ్ళని ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేశాడు. కాగా కిరణ్, రహస్య రాజా వారు రాణి గారు సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురుంచి.. పెళ్ళికి దారితీసింది. ఇపుడు వారు ఇరువురు తల్లి దండ్రులు అవడంతో ఇండస్ట్రీ ప్రముఖులతోపాటు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story