- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kiran Abbavaram: యంగ్ హీరో కొత్త సినిమా అప్‌డేట్.. త్వరలోనే అనౌన్స్‌మెంట్ వీడియో రాబోతుందంటూ పోస్ట్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) రీసెంట్‌గా ‘దిల్‌రూబా’ (Dilruba) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) రీసెంట్‌గా ‘దిల్‌రూబా’ (Dilruba) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ‘క’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత కిరణ్ చేసిన ‘దిల్‌రూబా’ చిత్రంపై ఆడియన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. విశ్వకరుణ్ (Vishwakaran) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య మార్చి 14న వచ్చి అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉంటే.. కిరణ్ ఇప్పుడు తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.
రవి నంబూరి (Ravi Namburi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘బేబీ’ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తీసిన మాస్ మూవీ మేకర్స్‌తో కలిసి అమృత ప్రొడక్షన్ సంస్థ నర్మిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి మణిశర్మ (Mani Sharma) సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో విశాఖపట్నంలో షూట్ చెయ్యగా.. త్వరలోనే దీనిని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమా మంచి లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోందని తెలుస్తుండగా.. మళ్లీ ఈ మూవీతో ‘క’ రేంజ్ హిట్ కొట్టాలి అంటూ బ్లెస్ చేస్తున్నారు ఫ్యాన్స్.






