Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ‘కెఎ10’ టైటిల్ ఫిక్స్.. అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?

by Chukka Sudharani |

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తాజాగా ‘క’ (Kaa) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు.

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ‘కెఎ10’ టైటిల్ ఫిక్స్.. అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తాజాగా ‘క’ (Kaa) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ఈయన తన తదుపరి చిత్రం కోసం సిద్ధం అవుతున్నాడు. ‘కెఎ10’ (KA10) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కతున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో విశ్వ కరుణ్ (Vishwa Karun) డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా రీసెంట్‌గా పూజాకార్యక్రమాలతో స్టార్ట్ కాగా ఇప్పుడు దీనికి సంబంధించిన మరో అప్‌డేట్ (Update) ఇచ్చారు మేకర్స్. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా టైటిల్ (Title) అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘క’ వంటి సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న ‘కెఎ10’ పై భారీ అంచనాలు ఉన్నాయి. అంతే కాకుండా కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే ఈ చిత్రం మరో మైల్ స్టోన్‌గా ఉండబోతుందంటూ చెప్పుకొచ్చారు మేకర్స్.




Next Story