- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ హీరోల సినిమాల్లో చాన్స్ కొట్టేస్తున్న కిరణ్ అబ్బవరం హీరోయిన్.. వైరల్ అవుతున్న న్యూస్
హీరోయిన్ నయన సారిక(Nayan Sarika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యంగ్ హీరో నార్ని నితిన్(Narne Nithin) కథానాయకుడిగా నటించిన ‘ఆయ్’(Aay) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ నయన సారిక(Nayan Sarika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యంగ్ హీరో నార్ని నితిన్(Narne Nithin) కథానాయకుడిగా నటించిన ‘ఆయ్’(Aay) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. తన ఫస్ట్ మూవీ తోనే మంచి విజయాన్ని సాధించడమే కాకుండా నటన పరంగా ఫుల్ మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన ‘క’(Ka) సినిమాలో నటించి మెప్పించింది. ఈ చిత్రం ఎంతగా హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా చేసిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో ఈ బ్యూటీ లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ క్రమంలో ఈ భామ మరో ఇద్దరు స్టార్ హీరల ప్రాజెక్టుల్లో చాన్స్ అందుకున్నట్లు ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ (Mohal Lal)ప్రస్తుతం వృషభ(Vrushabha) అనే భారీ బడ్జెట్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా (Pan Indian Project) ఈ సినిమాని.. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో ఈ మూవీని శోభా కపూర్, ఏక్తా కపూర్, సీకే పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి నంద కిషోర్(Nanda Kishore) దర్శకత్వం వహిస్తున్నారు.
మైథలాజికల్, యాక్షన్, ఎమోషనల్ కంటెంట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రీసెంట్‌గానే ముగిసింది. కాగా ఈ ఏడాది దీపావళి కానుకగా (Deepawali Release)ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇక మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నయన్ సారిక హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు సమాచారం.
మరి ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలో రానున్నట్లు సమాచారం. అలాగే కన్నడ స్టార్ హీరో గోల్డెన్ స్టార్ గణేష్(GOLDEN STAR GANESH) అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో ఒకటైన ‘పినాక’(Pinaka)లో కూడా ఈ బ్యూటీ చాన్స్ దక్కించుకుందట. అలా ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటించే ఆఫర్లు అందుకుంటూ రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోతుందేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.






