కిరణ్ అబ్బవరం: ఆ సినిమాలంటే పిచ్చి.. అవసరమైతే కోసేసుకుంటా.. మాస్ స్టేట్‌మెంట్ ఇచ్చిన యంగ్ హీరో

by Pulgam srinivas |

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ : తనకు బాలయ్య నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’, ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ సినిమాలు అంటే ఎంతో ఇష్టమని, వాటి కోసం కోసేసుకుంటా అని వ్యాఖ్యానించారు.

కిరణ్ అబ్బవరం: ఆ సినిమాలంటే పిచ్చి.. అవసరమైతే కోసేసుకుంటా.. మాస్ స్టేట్‌మెంట్ ఇచ్చిన యంగ్ హీరో
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం మంచి జోష్‌తో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న యువ నటుల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ఇప్పటివరకు నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన, తాజాగా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రాన్ని నిర్మిస్తూ నిర్మాతగా కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 17న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు కిరణ్ అబ్బవరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన నందమూరి బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రంలోని గెటప్‌లో ఈవెంట్‌కు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన కిరణ్ అబ్బవరం, తనకు నందమూరి బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’, ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ సినిమాలు అంటే ఎంతో ఇష్టమని, వాటి కోసం కోసేసుకుంటా అని వ్యాఖ్యానించారు. అందుకే ‘చెన్నకేశవ రెడ్డి’ గెటప్‌లో ఈవెంట్‌కు వచ్చానని చెప్పారు. మొదట ఈ గెటప్‌కు సరిపోయే విధంగా మీసాలు కూడా పెట్టాలని అనుకున్నానని, అయితే మరుసటి రోజు షూటింగ్ ఉండటంతో అది సాధ్యపడలేదని ఆయన వెల్లడించారు. ఇలా నందమూరి బాలకృష్ణ సినిమాలపై తనకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా వ్యక్తపరుస్తూ ‘చెన్నకేశవ రెడ్డి’ గెటప్‌లో ఈవెంట్‌కు హాజరైన కిరణ్ అబ్బవరంపై బాలయ్య అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Next Story