Kiran Abbavaram: 'తిమ్మరాజుపల్లి టీవీ' కోసం క్యారవాన్ లేకపోయినా అమ్మాయిలు కష్టపడ్డారు

by Pulgam srinivas |

కిరణ్ మాట్లాడుతూ, తక్కువ బడ్జెట్‌లో సినిమా పూర్తి కావడానికి ఇందులో నటించిన నటీనటులు ఎంతో సహకరించారని, వారి కష్టమే సినిమా పూర్తి కావడానికి ప్రధాన కారణమని ఈ నటుడు చెప్పుకొచ్చాడు.

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ కోసం క్యారవాన్ లేకపోయినా అమ్మాయిలు కష్టపడ్డారు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్ మరియు సుమైరా స్టూడియోస్‌తో కలిసి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమాను ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేయాలని మొదట నిర్ణయించుకున్నాను. సినిమా ప్రారంభం కాకముందే ఇందులో నటించే వారికి స్పష్టంగా చెప్పాను.

మన సినిమా బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది. మీకు అద్భుతమైన వసతులు కల్పించలేము, కనీసం క్యారవాన్ సౌకర్యం కూడా ఉండదు. ఒక ఊరికి వెళ్లి అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని సినిమా పూర్తి చేయాలి అని చెప్పాను” అని తెలిపారు. అందుకు నటీనటులు అందరూ ఎంతో సహకరించారని ఆయన చెప్పారు. “ఈ సినిమాలో ఎంతోమంది అమ్మాయిలు నటించారు. వారికి క్యారవాన్ సౌకర్యం లేకపోయినా చాలా కష్టపడి షూటింగ్ పూర్తి చేశారు.

అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని అన్నారు. సినిమా గురించి మాట్లాడుతూ, ఇందులో నటించిన నటీనటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని తెలిపారు. “ఈ మూవీ చూస్తే పల్లెటూరులో ఉన్న అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది” అని చెప్పారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి మునిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Next Story