- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kingdom: ‘కింగ్‌డమ్’కు భారీ ప్లాన్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా
డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో లేటెస్ట్ హై ఓల్టెడ్ మూవీ ‘కింగ్‌డమ్’.

దిశ, సినిమా : డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో లేటెస్ట్ హై ఓల్టెడ్ మూవీ ‘కింగ్‌డమ్’. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ యాక్షన్ డ్రామా జులై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'కింగ్‌డమ్' చిత్రానికి ప్రత్యేక టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 వరకూ పెంచుకునే అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ‘కింగ్‌డమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జులై 26న తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్‌లో జరగనున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. కాగా.. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. లింక్






