శ్రీవారి సేవలో కింగ్డమ్ మూవీ టీమ్.. వీడియో వైరల్

by Gugulothu.Kavitha |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న తాజా సినిమా ‘కింగ్డమ్’(Kingdom).

శ్రీవారి సేవలో కింగ్డమ్ మూవీ టీమ్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న తాజా సినిమా ‘కింగ్డమ్’(Kingdom). గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sre Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీ భారీ అంచనాల నడుమ జూలై 31న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్లలో జోరు పెంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు మూవీటీమ్.

ఈ క్రమంలో నిన్న ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచారు. అయితే తాజాగా కింగ్డమ్ మూవీటీమ్ తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

link

Next Story