OTT : కింగ్‌డమ్, మాస్ జాతర ఓటీటీ డీల్ కంప్లీట్.. రవితేజ కంటే విజయ్ దేవరకొండకే ఎక్కువ హైప్

by Chukka Sudharani |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’.

OTT : కింగ్‌డమ్, మాస్ జాతర ఓటీటీ డీల్ కంప్లీట్.. రవితేజ కంటే విజయ్ దేవరకొండకే ఎక్కువ హైప్
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత జులై 31 న థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘కింగ్‌డమ్’ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై హై లెవల్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను క్రియేట్ చేసింది. దీంతో తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌పై రాబోతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.50 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా రిలీజ్ తర్వాత ఓటీటీ విడుదలపై స్పష్టత వస్తోంది.

ఇక మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ మూవీ విషయానికి వస్తే.. భాను భోగవరకు డైరెక్షన్‌లో వస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనింగ్ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోహీరోయిన్‌గా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్టు 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ మేరకు తాజాగా మాస్ జాతర ఓటీటీ డీల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ.20 కోట్లు చేజిక్కించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. మాస్ జాతర కంటే కింగ్‌డమ్ మూవీపై ఎక్కువ హైప్ ఉండటంతో రౌడీ హీరో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లింక్


Next Story