Kichcha Sudeep: హైదరాబాద్ మెట్రోలో సందడి చేసిన హీరో నాని విలన్

by Yella Dhawani Reddy |

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Kichcha Sudeep: హైదరాబాద్ మెట్రోలో సందడి చేసిన హీరో నాని విలన్
X

దిశ, వెబ్ డెస్క్: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వంలో హీరో నాని, సమంత జంటగా తెరకెక్కిన ఈగ మూవీలో విలన్‌గా నటించి తెలుగులోనూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. విలన్‌గా తెలుగు వారికి పరిచయం అయినా కూడా హీరోగానూ ఇక్కడ అదరగొట్టేశారు. ఇక ప్రస్తుతం కిచ్చా సుదీప్ సెలబ్రెటీ క్రికెట్ లీగ్‌లో (CCL) ఆడుతున్నారు. ఇందు కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన.. బుధవారం మెట్రోలో ప్రయాణించి సందడి చేశారు. అంతేకాకుండా మెట్రో స్టేషన్‌లో తన టీమ్‌తో కలిసి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

CCL సీజన్ 11 ఫిబ్రవరి 8న ప్రారంభమైంది. ఈ లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్డేడియంతో రెండు రోజుల పాటు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక బుల్డోజర్స్ టీమ్ నగరానికి చేరుకుంది. ఉప్పల్ స్డేడియం వెళ్లేందుకు మెట్రోలో ప్రయాణించడంతో పలువురు అభిమానులు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. కాగా కిచ్చా సుదీప్ కర్ణాటక బుల్డోజర్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. వీరి టీం ఫిబ్రవరి 14న ఉప్పల్ స్డేడియంలో జరగనున్న మ్యాచ్‌లో చెన్నై రైనోస్‌తో తలపడనుంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఫైనల్స్ మార్చి 2న జరగనుంది. ఈ మ్యాచ్‌లను డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

ఇక కిచ్చా సుదీప్ చివరిసారిగా మాక్స్‌ మూవీలో నటించారు. ఈ మూవీ కన్నడలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

Next Story