Kiccha Sudeep: షాకింగ్ నిర్ణయం తీసుకున్న కిచ్చా సుదీప్.. క్షమాపణలు కోరుతూ ఎమోషనల్ ట్వీట్

by Hamsa |
Kiccha Sudeep: షాకింగ్ నిర్ణయం తీసుకున్న కిచ్చా సుదీప్.. క్షమాపణలు కోరుతూ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) ప్రతిష్టాత్మక అవార్డును అందించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఉత్తమ నటుడి కేటగిరీలో ఆయనకు అవార్డు దక్కింది. ఇక దీనిపై కిచ్చ సుదీప్ x ద్వారా రియాక్ట్ అవుతూ షాకింగ్ పోస్ట్ పెట్టారు. ‘‘ఉత్తమ నటుడి కేటగిరి కింద రాష్ట్ర స్థాయి అవార్డును అందుకోవడం ఆనందంగా ఉంది. నాకు ఈ గౌరవం కల్పించిన జ్యూరీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

కానీ నేను చాలా సంవత్సరాలుగా అవార్డులు అందుకోవడం ఆపివేయాలని నిర్ణయించుకున్నా. వివిధ వ్యక్తిగత కారణాల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్న. కానీ ఇప్పుడు అదే మాటకు కట్టుబడి ఉన్నా. చాలా మంది టాలెంటెడ్ నటీనటులు ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ఇస్తే నా కంటే చాలా ఎక్కువగా అభినందిస్తారు. వారిలో ఒకరు దానిని స్వీకరించడం నాకు మరింత సంతోషాన్నిస్తుంది. ఎలాంటి అవార్డులు ఆశించకుండా అభిమానులను అలరించడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను.

నా నిర్ణయం ఏదైనా నిరాశ కలిగించినందుకు జ్యూరీ సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి(State Government) క్షమాపణలు చెబుతున్నా. మీరు నా అభిప్రాయాన్ని గౌరవిస్తారని నేను ఎంచుకున్న మార్గంలో మద్దతు ఇస్తారని నమ్ముతున్నాను. అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రతి జ్యూరీ సభ్యులకి(Jury members) కృతజ్ఞతలు. ఎందుకంటే.. నా కృషికి గుర్తించి ఈ అవార్డుకు నన్ను పరిగణనలోకి తీసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం కిచ్చా సుదీప్ ట్వీట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కొందరు అవార్డును వద్దు అనుకోవడం ఏంటని షాక్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed