Kiccha Sudeep: ఎమోషనల్ నోట్ విడుదల చేసిన కిచ్చా సుదీప్.. అసలేం జరిగిందంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-12 12:44:37  IST  )

గత రెండు రోజులు భారత్-పాక్ మధ్య భీకర యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.

Kiccha Sudeep: ఎమోషనల్ నోట్ విడుదల చేసిన కిచ్చా సుదీప్.. అసలేం జరిగిందంటే?
X

దిశ, సినిమా: గత రెండు రోజులు భారత్-పాక్ మధ్య భీకర యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. గత నెలలో జమ్ముకాశ్మీర్‌లో జరిగిన దాడికి బదులుగా పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ప్రతీకారం తీర్చుకుంది. ఇందులో భారత్ సైనికులు పాక్‌ను చిత్తు చిత్తు చేశారు. ఇక ఈ యుద్ధంలో ఇరు దేశాల ప్రజలు మరణించడంతో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో దేశ సరిహద్దుల్లో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే యుద్ధం విరమివచుకోనున్నట్లు ఇరు దేశాలు ఒప్పుకున్నాయని ట్రంప్ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తాజాగా, కన్నడ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) , ప్రధాని మోడీకి(Prime Minister Modi) ఓ లేఖ రాశాడు. ‘‘మా తల్లి శ్రీమతి సరోజా మరణం పట్ట మీరు పంపిన సానుభూతి లేఖకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆ క్లిష్ట సమయంలో మీ మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి.

నేను గర్వించదగ్గ భారతీయుడిగా ఈ లేఖ రాస్తున్నాను. ఆపరేషన్ సిందూర్ విజయానికి దేశం అభినందనలు తెలుపుతోంది. నేను కూడా దీన్ని మెచ్చుకుంటున్నాను. భారత్ వెనక్కి తగ్గదు.. మర్చిపోదు.. ఎల్లప్పుడూ పైకి లేస్తుందనే సందేశం ప్రపంచానికి అందించింది. మీలో మేము కేవలం మాటలతో నడిపించే నాయకుడినే కాదు దృఢ సంకల్పంతో ముందుకు నడిపించే నాయకుడిని చూస్తున్నాము. కన్నడ చిత్రపరిశ్రమ మీ వెన్నంటే ఉంది. మీ ధైర్యం మాకు స్ఫూర్తి. మీ నాయకత్వంలో మన రక్షణ దళాలు అద్భుతమైన కచ్చితత్వం, క్రమశిక్షణ శౌర్యం ప్రదర్శించాయి. మనమంతా ఒకే జాతి, ఒకే స్వరం ఒకే దేశం ఐక్యంగా నిలుద్దాం’’ అని రాసుకొచ్చాడు.

Next Story