2025 మెట్ గాలాలో బేబీ బంప్‌తో కార్పెట్‌పై నడిచిన కియారా అద్వానీ.. ఆకట్టుకుంటోన్న ఫొటోలు

by Kodari Anjali |

2025 మెట్ గాలాలో తన బేబీ బంప్‌తో కార్పెట్‌పై నడిచిన తొలి భారతీయ నటిగా కియారా అద్వానీ అద్భుతంగా అరంగేట్రం చేసింది.

2025 మెట్ గాలాలో బేబీ బంప్‌తో కార్పెట్‌పై నడిచిన కియారా అద్వానీ.. ఆకట్టుకుంటోన్న ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: 2025 మెట్ గాలాలో తన బేబీ బంప్‌తో కార్పెట్‌పై నడిచిన తొలి భారతీయ నటిగా కియారా అద్వానీ అద్భుతంగా అరంగేట్రం చేసింది. ఆమె భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన బ్రేవ్‌హార్ట్స్ అనే కస్టమ్ కోచర్ గౌను ధరించింది. ఇది మాతృత్వం అండ్ సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తుంది.

ఈ గౌనులో ఘుంగ్రూలు, స్ఫటికాలతో అలంకరించిన పురాతన బంగారు బ్రెస్ట్‌ప్లేట్‌తో ఉంది. సింబాలిక్ మదర్ హార్ట్, బేబీ హార్ట్ ఆకారాలు గొలుసు బొడ్డు తాడుతో అనుసంధానించిన, తల్లి బంధాన్ని దృశ్యమానంగా వివరిస్తున్నాయి. ఈ లుక్ ఫ్యాషన్ ఐకాన్ ఆండ్రీ లియోన్ టాలీకి నాటకీయ డబుల్-ప్యానెల్డ్ కేప్‌తో నివాళి అర్పించింది. తల్లి కాబోతున్న కియారా అద్వానీ మెట్ గాలా 2025 లో నిజమైన బాలీవుడ్ స్టార్ లా మెరుస్తోంది. కియారా ఈ ఫొటోలు పంచుకుంటూ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘మే నెలలో అమ్మ మొదటి సోమవారం’’ అంటూ ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది.

ఇక ఈ బ్యూటీ సినిమాల్లో నటించే క్రమంలోనే సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడిది. వీరిద్దరూ బాలీవుడ్‌లో స్టార్ గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రేమలో పడ్డాక రెండేళ్లు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 7 వ తారీకున 2013 న కుటుంబ సభ్యుల నడుమ ఏడడుగుల బంధంలోని అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. కియారా త్వరలో తల్లి కాబోతుంది. ఈ జంట ఇప్పుడు మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు.

Next Story