Kiara Advani: కియార కెరీర్‌కు గట్టి దెబ్బ.. తమ ప్రాజెక్టుల నుంచి తొలగించిన ప్రముఖ సంస్థ

by Chukka Sudharani |   (  Updated:2025-10-13 14:19:01  IST  )

‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ.

Kiara Advani: కియార కెరీర్‌కు గట్టి దెబ్బ.. తమ ప్రాజెక్టుల నుంచి తొలగించిన ప్రముఖ సంస్థ
X

దిశ, సినిమా: ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. దీంతో అక్కడ వరుస సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ‘వార్-2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో గ్లామర్ రోల్ అలరించిన కియార మొదటి సారి బికినీ లుక్‌లో కనిపించి అందరిని షాక్‌కు గురిచేసింది. కానీ ఇవేవి వర్కౌట్ కానట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కియార చేతిలో ‘టాక్సిక్’తో పాటు మరో మూడు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తుండగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్స్ నుంచి ఆమెను తొలగించినట్లు టాక్. ఇటీవల తల్లి అయిన కియారా ప్రజెంట్ మెటర్నిటీ బ్రేక్‌లో ఉంది. అలాగే రీసెంట్‌గా వార్ 2 పరాజయం.. ఇవన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రముఖ సంస్థ వైఆర్‌ఎఫ్ తమ ప్రాజెక్టుల నుంచి కియారాను తొలగించి కొత్త హీరోయిన్‌ను వెతికే పనిలో పడినట్లు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ఈ వైరల్ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియనప్పటికీ.. వార్ 2 కియారాకు గట్టి దెబ్బ కొట్టిందని అంటున్నారు నెటిజన్లు.

Next Story