- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌కు జోడీగా బీటౌన్ బ్యూటీ!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్టు రాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్టు రాబోతున్న విషయం తెలిసిందే. ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ కలయికపై ఇటీవల అఫీషియల్ అప్డేట్ ఇస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు మేకర్స్. ‘శివుడి కుమారుడు.. పార్వతీదేవికి గర్వకారణం.. దేవ సేనాని’ అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు పలు పోస్టులు దర్శనమిచ్చాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పేరు బలంగా వినిపిస్తోందని టాక్. ఇప్పటికే కథ చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అయితే.. ఇప్పటివరకు ఎన్టీఆర్, కియారా కలిసి నటించకపోవడంతో ఈ కాంబినేషన్‌పై ఆసక్తి పెరిగింది. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతో, కియారా ఎంపికపై అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ నెలకొంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ ప్రాజెక్టుకు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.






