- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖలేజా సినిమా చూస్తూ డ్యాన్స్ చేసిన రామ్ చరణ్.. హర్ట్ అయిన మెగా ఫ్యాన్స్.. వీడియో వైరల్
ఖలేజా సినిమా రీరిలీజ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. రిలీజ్ టైంలో ఇంత బాగా ఎంజాయ్ చేశారో లేదో కానీ ఇప్పుడు మాత్రం సీన్స్, సాంగ్స్ రీక్రియేట్ చేస్తూ

దిశ, ఫీచర్స్ : ఖలేజా సినిమా రీరిలీజ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. రిలీజ్ టైంలో ఇంత బాగా ఎంజాయ్ చేశారో లేదో కానీ ఇప్పుడు మాత్రం సీన్స్, సాంగ్స్ రీక్రియేట్ చేస్తూ మురిసిపోతున్నారు. హాస్పిటల్ సీన్.. దిలావర్ సింగ్ భార్య ఫొటోలు.. అనుష్క, మహేష్ మధ్య ఫోన్ కాల్.. డ్యాన్సులతో థియేటర్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. క్లిపింగ్స్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ వీడియో వైరల్ అవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాదిరిగా ఉన్న ఓ మహేష్ బాబు ఫ్యాన్ థియేటర్‌లో స్టెప్పులేయడం ట్రెండ్ అవుతోంది. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఖలేజా సినిమాకు చరణ్ డ్యాన్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇక దీనిపై కొందరు పాజిటివ్‌గా రియాక్ట్ అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అయ్యారు. ఇలాంటి వీడియోలకు మా హీరో పేరు పెడితే బాగోదని వార్నింగ్ ఇస్తున్నారు. ఇకపై ఇలాంటి జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియోతో చెర్రీ లాగా కనిపించే ప్రిన్స్ ఫ్యాన్ వైరల్ కావడం విశేషం. కాగా రీరిలీజ్ కారణంగా ఇలాంటి వీడియోలు చూస్తే పిచ్చెక్కుతుందని.. దయచేసి రీరిలీజ్‌లు ఆపాలని డిమాండ్ చేస్తున్నవారు కూడా లేకపోలేదు.






