- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lokesh Kanagaraj: ఫైనల్‌గా సెట్స్‌పైకి ‘ఖైదీ-2’.. ఫామ్‌లోకి లోకేష్ కనగరాజ్
ఈ ఏడాది ‘కూలీ’ చిత్రంతో వచ్చిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. ఊహించినంత రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు.

దిశ, సినిమా: ఈ ఏడాది ‘కూలీ’ చిత్రంతో వచ్చిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. ఊహించినంత రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. అయితే.. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ లోకేష్.. కమల్ హాసన్, రజినీకాంత్ కాంబోలో మరో మల్టీ స్టారర్ తీయబోతున్న వార్తలు వచ్చాయి. ఇందులో నిజం లేనట్టు చెప్పకనే చెప్పేశాడు డైరెక్టర్. దీంతో లోకేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందనే టైమ్‌లో ఓ అప్డేట్ కోలీవుడ్ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తుంది. లోకేష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం సిద్ధం అయినట్లు తెలుస్తుంది. కార్తీ హీరోగా, లోకేష్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఖైదీ’ చిత్రం సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ఖైదీ 2 చేయబోతున్నాడు. ఇది లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఉండబోతోందని తెలుస్తుండగా.. ఈ రోజు నుంచి దీనికి సంబంధించిన ప్రీ- ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయినట్లు అధికారిక సమాచారం. దీంతో ఖైదీ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రేక్షకులు అప్డేట్స్ కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.






