'రాకా' యూనిట్ కీలక నిర్ణయం.. ముందుగా దీపికా ఎపిసోడ్స్ పూర్తి

by Pulgam srinivas |   (  Updated:2026-04-20 07:16:47  IST  )

రాకా మూవీ బృందం దీపికా పదుకొనేకు సంబంధించిన షూటింగ్ భాగాన్ని ముందుగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాకా యూనిట్ కీలక నిర్ణయం.. ముందుగా దీపికా ఎపిసోడ్స్ పూర్తి
X

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ లాంటి భారీ విజయం తర్వాత తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాక’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా కనిపించనుండగా, రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న దీపికా పదుకొనేకు సంబంధించిన సన్నివేశాలను ముందుగా పూర్తి చేయాలని మేకర్స్ ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమెపై కూడా అనేక యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, అందులో భాగంగా కొన్ని సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించినట్లు సమాచారం.

మిగిలిన సన్నివేశాలను కూడా చాలా తక్కువ రోజుల్లోనే చిత్రీకరించి ఆమె భాగాన్ని పూర్తి చేయాలని మూవీ బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీపికా పదుకొనే గర్భిణిగా ఉండటంతో, మరికొన్ని రోజుల తర్వాత ఆమెపై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడం కష్టం అవుతుందని భావించి, ముందుగానే ఆమెకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయాలని మూవీ బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్లో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.

థియేటర్లలో ఫ్లాప్.. ‘ఉస్తాద్’కి ఓటీటీలో షాకింగ్ రెస్పాన్స్

Next Story