థియేటర్లలో ఫ్లాప్.. ‘ఉస్తాద్’కి ఓటీటీలో షాకింగ్ రెస్పాన్స్

by Pulgam srinivas |

'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రస్తుతం పదికి పైగా దేశాల్లో ట్రెండింగ్‌లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

థియేటర్లలో ఫ్లాప్.. ‘ఉస్తాద్’కి ఓటీటీలో షాకింగ్ రెస్పాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది. విడుదలైన తర్వాత కొన్ని రోజులకే ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది.

ఇక బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయిన ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా పదికి పైగా దేశాల్లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నట్లు సమాచారం. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయినప్పటికీ, ఈ సినిమా ఓటీటీలో అద్భుతమైన స్పందనను అందుకుంటుండటంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడిగా శ్రీలీల, రాశి ఖన్నా నటించగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ నేపథ్య సంగీతాన్ని అందించారు.

Next Story