ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... బాహుబలి రీ-రిలీజ్ పై కీలక ప్రకటన !

by velandi.Saikiran |   (  Updated:2025-07-09 13:32:12  IST  )

ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పది, పదిహేను సంవత్సరాల

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... బాహుబలి రీ-రిలీజ్ పై కీలక ప్రకటన !
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పది, పదిహేను సంవత్సరాల కిందట రిలీజ్ అయిన సినిమాలను ఇప్పుడు రిలీజ్ చేసి... నిర్మాతలు డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు. అంతేకాదు అప్పట్లో రిలీజ్ అయిన సినిమాలు డిజాస్టర్ కాగా... అవే సినిమాలు మళ్లీ రీ రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ తీసుకువస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా.. ప్రభాస్ అలాగే రానా ప్రధాన పాత్రలో నటించిన బాహుబలి ( Baahubali) సినిమాలు కూడా రీ రిలీజ్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అప్పట్లో ఈ సినిమా టికెట్ల కోసం థియేటర్లోనే కొట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే బాహుబలి రెండు పార్టులు కూడా సక్సెస్ అయ్యాయి. అయితే ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయాలని చాలామంది డిమాండ్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో.. రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలోనే చిత్ర బృందం నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. బాహుబలి సినిమా రిలీజ్ అయి... రేపటికి పది సంవత్సరాలు పూర్తి కానుంది. దీంతో బాహుబలి వస్తున్నాడు అని మేకర్స్ పోస్ట్ పెట్టారు. అంతేకాదు బాహుబలి 1, 2 రెండు సినిమాలు కూడా ఒకేసారి రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారట. దీంతో అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో పండగ చేసుకుంటున్నారు.

Next Story