బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కేతికా శర్మ స్టన్నింగ్ లుక్.. అందాలతో ఆకట్టుకున్న బ్యూటీ

by Pulgam srinivas |   (  Updated:2026-04-24 13:01:35  IST  )

బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అందాల వర్షం కురిపిస్తున్న కేతిక శర్మ.

బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కేతికా శర్మ స్టన్నింగ్ లుక్.. అందాలతో ఆకట్టుకున్న బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: నటి కేతిక శర్మ 1995 డిసెంబర్ 25న ఢిల్లీలో జన్మించింది. ఆమె విద్యాభ్యాసం లక్నౌలోని లా మార్టినీర్స్ పాఠశాలలో, అనంతరం ఢిల్లీ యూనివర్సిటీలో పూర్తయింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఈమె మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె, 2021లో విడుదలైన ‘రొమాంటిక్’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించకపోయినా, అందులో ఈమె తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మంచి గుర్తింపు ఈ సినిమా ద్వారా ఈ నటి తెచ్చుకుంది.

ట్రెడిషనల్ లుక్‌లో తళుక్కుమన్న శృతి హాసన్

ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించిన కేతిక 'సింగిల్' మూవీని మినహాయిస్తే పెద్ద విజయాలను అందుకోలేదు. అయితే సినిమాల్లో తన అందాలతో కుర్రకారుకు ఎప్పటికప్పుడు హీట్ పెంచుతున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో కూడా అందుకు ఏమాత్రం తగ్గని రీతిలో సందడి చేస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈమె బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న స్లీవ్‌లెస్ డ్రెస్ ధరించి, తన ఎద అందాలు హైలైట్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.

అలాగే తన కురులను వెనక్కు, ముందుకు వేసుకుంటూ విభిన్న యాంగిల్స్‌లో పోజులు ఇచ్చింది. ఈ యాంగిల్స్‌లో ఈమె చాలా హాట్ లుక్‌లో కనిపించడంతో ఈ పిక్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలకు లైక్స్, కామెంట్స్ కూడా భారీగా వస్తున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story