- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రెడిషనల్ లుక్‌లో తళుక్కుమన్న శృతి హాసన్.
నడుము అందాలతో మత్తెక్కించిన శృతిహాసన్.. రెడ్ శారీలో వైరల్ పిక్స్.

దిశ, వెబ్ డెస్క్: లోక నాయకుడు కమల్ హాసన్ గారాలపట్టి శృతిహాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కేవలం నటిగా మాత్రమే కాకుండా సింగర్‌గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. తన ప్రతిభతోనే ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శృతి, ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను దక్కించుకుంది.
ఇక 2023లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన శృతిహాసన్, ఆ సంవత్సరంలో అనేక చిత్రాలతో మంచి విజయాలను కూడా అందుకుంది. అయితే ఆ తర్వాత నుంచి ఈమె సినిమాల సంఖ్య కొంతవరకు తగ్గింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంలో శృతిహాసన్ స్పెషల్ సాంగ్ చేయబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలో నిజంగానే శృతి స్పెషల్ సాంగ్ చేస్తే, ఆ సాంగ్ మూవీకి మంచి ప్లస్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన అందాలతో అభిమానులను ఆకట్టుకునే శృతిహాసన్, తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలలో ఈమె రెడ్ కలర్ శారీ ధరించి, దానికి తగిన స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయింది. ముఖ్యంగా తన నడుము అందాలు హైలైట్ అయ్యేలా స్టైలిష్ స్టిల్స్ ఇస్తూ అందరినీ ఆకట్టుకుంది.
అలాగే ఈ ఫోటోలలో పెద్ద ఇయర్ రింగ్స్ ధరించి, నుదుటిన అందమైన బొట్టు పెట్టుకుని చిరునవ్వుతో నిలబడిన శృతి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. ముఖ్యంగా ఈ పిక్స్‌లో ఆమె జుట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తంగా ఈ ఫోటోలలో శృతిహాసన్ చాలా అందంగా కనిపించడంతో, ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఈ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






