ఆ పాపం మొత్తం డైరెక్టర్ దే...నన్ను ఇరికించారు.. కేతిక కామెంట్స్

by velandi.Saikiran |   (  Updated:2025-05-06 12:54:26  IST  )

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంత మంది తక్కువ కాలంలోనే సక్సెస్

ఆ పాపం మొత్తం డైరెక్టర్ దే...నన్ను ఇరికించారు..  కేతిక కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంత మంది తక్కువ కాలంలోనే సక్సెస్ అవుతుంటే... మరికొంతమంది ఎంత కష్టపడ్డా సక్సెస్ కావడం లేదు. మరి కొంతమంది... ఐటెం సాంగ్ ( Item song) అవకాశాలు వచ్చినా కూడా చేసేస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో కేతికా శర్మ ( Ketika Sharma) ఒకరు. ఈ అందాల తార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలతో చేసిన ఈ బ్యూటీ... ఇటీవల రాబిన్ హుడ్ సినిమాలో ( Robin Hood ) ఐటమ్ సాంగ్ చేసింది. అదిదా సర్ప్రైజ్ ( Adhi Dha Surprisu Song Controversy) అనే ఐటెం సాంగ్ లో ఈ బ్యూటీ హాట్ హాట్ గా మెరిసింది. సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ... ఆమె చేసిన ఈ ఐటమ్ సాంగ్ మాత్రం రికార్డులతో పాటు వివాదాన్ని తీసుకువచ్చింది. ఈ పాటలో.. కేతికా శర్మ వేసిన స్టెప్పులు అసభ్యకరంగా ఉన్నాయని శేఖర్ మాస్టర్ పైన కూడా విమర్శలు వచ్చాయి. అటు సినిమాలో కూడా ఈ పాటను తొలగించాలని... డిమాండ్ కూడా వినిపించింది.

అయితే తాజాగా ఈ పాట వివాదంపై కేతికా శర్మ స్పందించారు. అసలు ఈ పాట వివాదం గురించి తనకు తెలియదని వివరణ ఇచ్చారు. డైరెక్టర్ చెప్పినట్లు మాత్రమే తాను చేశాను... స్టెప్పులు వేయమన్నట్లు వేశాను.. అంటూ క్లారిటీ ఇచ్చింది. నేను షూటింగ్ వెళ్లాను అంటే డైరెక్టర్ కు సరెండర్ అయిపోతా... అంటూ బాంబు పేల్చింది. ఈ పాట బయటకు వచ్చిన తర్వాత వివాదం గురించి తనకు తెలిసినట్లు స్పష్టం చేసింది. కానీ కావాలని చేయలేదని వివరణ ఇచ్చింది. దీంతో కేతికా శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Next Story